గ్రూప్-2 ఫైనల్ ప్రొవిజనల్ జాబితాపై తెలంగాణ హైకోర్టు స్టే

  • తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నియామకాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు
  • గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారన్న పిటిషనర్లు
  • ఈ మేరకు టీఎస్ పీఎస్ సీకు ఆదేశాలు జారీ
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు సంబంధించి వెలువడ్డ ఫైనల్ ప్రొవిజనల్ ఫలితాల జాబితాపై హైకోర్టు స్టే జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని టీఎస్ పీఎస్ సీకి ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-2 కేసులో గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ టీఎస్ పీఎస్ సీ వ్యవహరించిందని గ్రూప్-2 అభ్యర్థులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

 వైట్ నర్, ట్యాంపరింగ్, క్రాచింగ్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేయవద్దని పిటిషన్లో కోరారు. కాగా, 2016 లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు పరీక్ష నిర్వహణ నిబంధనలపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీర్ఘ కాలంగా కోర్టులో విచారణ జరిగింది. ఇటీవల కోర్టు తీర్పుతో టీఎస్ పీఎస్ సీ ఫైనల్ ప్రొవిజనల్ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అభ్యర్థులు ఫైనల్ జాబితాపై కూడా పిటిషన్ వేశారు.
Go Back to Shorts
Group-2 Examination Telangana
Final Provisional list
High Court stay

More Telugu News